Blue Egg: సాధారణంగా కోడిగుడ్లు తెలుపు లేదా ముదురు గోధుమ కలర్ లో ఉంటాయి. ఇవే మార్కెట్లో కూడా ఎక్కువగా దర్శనమిస్తాయి. కర్ణాటకలోని ఒక కోడి మాత్రం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కోడి పెట్టిన గుడ్డు బ్లూ కలర్ లో ఉండటంతో స్థానికంగా సంచలనం రేపింది. అయితే, దేవనగరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్ల పెంపకందారుడు. అతడి దగ్గర 10 నాటుకోళ్లు ఉన్నాయి. ఇందులో ఒక కోడి ఇటీవల నీలి రంగు గుడ్డు పెట్టడంతో పాటు సాధారణ గుడ్ల కంటే భిన్నంగా ఉండటంతో తొలుత సయ్యద్ నూర్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ గుడ్డును జాగ్రత్తగా భద్రపర్చాడు.. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది.
Read Also: Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ పై క్రేజీ డీల్.. రూ. 10 వేల డిస్కౌంట్..
అధికారుల పరిశీలన
ఈ విషయం జంతు సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన వారు వచ్చి ఆ కోడిని పరిశీలించారు. కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లు పెట్టిన ఘటనలు కూడా ఉన్నప్పటికీ.. పూర్తిగా బ్లూ కలర్ లో ఉండటం చాలా అరుదని చెప్పుకొచ్చారు. కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం వల్లే గుడ్డు నీలి రంగులోకి మారి ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Annamalai: స్టాలిన్‌ది కపట రాజకీయం.. బీహార్ టూర్‌పై అన్నామలై విమర్శలు
ఆరోగ్యంపై ప్రభావం లేదా?
అయితే, జన్యుపరమైన మార్పులతో కోళ్లు కొన్నిసార్లు భిన్న రంగుల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఇక, పోషక విలువల విషయంలో మాత్రం ఈ గుడ్లు, సాధారణ గుడ్లలాగే సమానమేనని స్పష్టం చేశారు. ఇలాంటి రంగుల గుడ్లు కొత్త కాదని.. లాటిన్ అమెరికా దేశాల్లో పెరిగే కొన్ని ప్రత్యేక జాతుల కోళ్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లో గుడ్లు పెట్టే ఘటనలు సర్వసాధారణమేనని చెప్పుకొచ్చారు. ఆ కోళ్లలో బిలివర్డిన్ అధికంగా ఉండటమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
