Site icon NTV Telugu

Rare Ghost: శాస్త్ర‌వేత్త‌ల‌ను భ‌య‌పెట్టిన వింత జంతువు…

ఈ భూగోళంలో ఎన్నో వింత‌లు, విశేషాలు ఉన్నాయి. కొన్ని వింత‌లు ఆక‌ట్టుకునే విధంగా ఉంటే, మ‌రికొన్ని వింత‌లు భ‌య‌పెట్టేవిధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఇదికూడా ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ స‌ముద్రంలోని 1.2 కిలోమీట‌ర్ల దూరంలో ఓ వింత జంతువును శాస్త్రవేత్త‌లు గుర్తించారు. ఆ జంతువును చూసి మొద‌ట షాక్ అయ్యారు. క‌ళ్లు, మూతి పెద్ద‌విగా ఉండ‌టంతో పాటు, దాని ఆకారం భ‌య‌పెట్టేవిధంగా ఉంది. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ అండ్ అట్మాస్పీయ‌ర్ రీసెర్చ్ శాస్త్ర‌వేత్త‌లు స‌ముద్రం లోప‌ల ప‌రిశోధ‌న చేస్తున్న స‌మ‌యంలో ఈ వింత ఆకారం క‌లిగిన జంతువు బ‌య‌ట‌ప‌డింది.

Read: CM KCR: కేసీఆర్‌పై అమితాభిమానం.. ఐదో తరగతి విద్యార్థిని డ్రాయింగ్ ప్రతిభ

అయితే, శాస్త్ర‌వేత్త‌లు ఆ జంతువును ప‌రిశీలించి దానిని బేబీ షార్క్‌గా గుర్తించారు. స‌ముద్రం అట్ట‌డుగు నేల‌పైన షార్క్‌లు గుడ్ల‌ను పెడ‌తాయి. వాటి నుంచి పిల్లలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. స‌ముద్రం అడుగుభాగంలో ఎక్కువ‌గా ఘోస్ట్ షార్క్‌లు ఉంటాయ‌ని, అవి అన్ని ర‌కాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని జీవ‌నం కొన‌సాగిస్తుంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ ర‌క‌మైన షార్క్‌లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వీలైనంత వ‌ర‌కు ఇలాంటి షార్క్‌లు స‌ముద్రం అడుగుభాగంలోనే నివ‌శిస్తుంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

Exit mobile version