NTV Telugu Site icon

Kedarnath: ఆలయంలోకి పెంపుడు కుక్క.. కేసులు పెట్టిన ఆలయ కమిటీ

Dog In Temple

Dog In Temple

కేదార్‌నాథ్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన వికాష్ త్యాగి (33) అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అతడు తన పెంపుడు కుక్కతో నవాబ్ ఆలయ వెలుపల ఉన్న నంది విగ్రహాన్ని తాకాడు. అంతటితో ఆగకుండా తన పెంపుడు కుక్కకు పూజారితో తిలకం దిద్దించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ సభ్యులు కుక్క యజమాని వికాష్ త్యాగిపై కేసులు కూడా పెట్టారు. ఇది కించపరిచే చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు ఆలయానికి భక్తితో రారని ఆలయ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ఆలయంలో భారీ సంఖ్యలో కమిటీ సిబ్బంది, పోలీసులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం విచారకరమంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, సదరు వ్యక్తిపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మే 17న బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఓ లేఖను విడుదల చేశారు.