Site icon NTV Telugu

Pet Cats Save Woman: మహిళ ప్రాణాలను కాపాడిన పెంపుడు పిల్లులు..! సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్..

Pet Cats

Pet Cats

పెంపుడు పిల్లులు మహిళలను రక్షించాయి. వాస్తవానికి.. ఒక మహిళ తన గదిలో సోఫాలో కూర్చుని తన ఫోన్ చూసుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న పెంపుడు పిల్లి ఒక వింత ప్రమాదాన్ని గ్రహించి వెంటనే అప్రమత్తమైంది. కొన్ని సెకన్ల తర్వాత అక్కడ ఏమి జరిగిందో తెలియలేదు. కానీ.. పిల్లుల కారణంగా.. ఆ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన మొత్తం CCTV కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: YouTube Launches Hype: యూట్యూబ్‌లో ‘Hype’ ఫీచర్.. చిన్న క్రియేటర్లకు పెద్ద అవకాశాలు!

వైరల్ ఫుటేజ్‌లో.. ఒక చైనీస్ మహిళ తన గదిలో సోఫాలో కూర్చుని మొబైల్‌లో ఏదో చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె చుట్టూ మూడు పెంపుడు పిల్లులు ఉన్నాయి. అవి వేర్వేరు ప్రదేశాలలో కూర్చుని ఉన్నాయి. టీవీ దగ్గర కూర్చున్న పిల్లి ఏదో గమనించింది. వెంటనే పైకి చూస్తూ అప్రమత్తమవుతుంది. మిగిలిన పిల్లులు కూడా ప్రమాదాన్ని పసిగట్టి అక్కడి నుంచి పారిపోతాయి. పిల్లుల పారిపోవడాన్ని గమనించిన ఆ మహిళ దృష్టి ఫోన్ నుంచి మళ్లింది. ఆమె వాటితో పాటు అక్కడి నుంచి పారిపోయింది. ఆ క్షణంలో టీవీ వెనుక నుంచి ఒక పెద్ద టైల్ నేలపై పడింది. అదృష్టవశాత్తూ.. ఆ మహిళ కొన్ని సెకన్ల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో phoenixtv_news అనే పేజీలో షేర్ చేశారు.

READ MORE: Porsche Cayenne: ఈ కారు ధరకు నగరాలలో విలాసవంతమైన ఇంటిని కొనవచ్చుగా.. కొత్త పోర్ష్‌ కయెన్ బ్లాక్ వర్షెన్ రిలీజ్.!

Exit mobile version