పెంపుడు జంతువులను యజమానులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. వాటి కోసం ఎంత ఖర్చైనా పెడుతుంటారు. యూకేకు చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ అంటే చాలా ఇష్టం. దానితోనే ఎక్కువ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే, కొన్ని రోజులాగా ఆల్ఫీ అనారోగ్యంపాలైంది. తరచుగా వాంతులు చేసుకుంటున్నది. అంతేకాదు, నీరసంగా మారడం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండటంతో ఆందోళన చెందిన నీల్ వెంటనే దానిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు స్కాన్ చేసి షాక్ అయ్యారు. కుక్క కడుపులో గోల్ఫ్ బాల్స్ ఉన్నాయని గుర్తించారు.
Read: Ukraine Crisis: రష్యాతో యుద్ధం చేసేందుకు గన్ను పట్టిన 79 ఏళ్ల బామ్మ…
అందువలనే వాంతులు చేసుకుంటున్నదని, నీరసంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆల్ఫీ కడుపులోనుంచి 25 గోల్ఫ్ బాల్స్‌ను బయటకు తీశారు. కుక్కకు ఆపరేషన్ కోసం నీల్ రూ. 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయిందని, డబ్బుఖర్చైనా ఆల్ఫీ బతికింది చాలని సంతోషం వ్యక్తం చేశాడు నీల్.
