Site icon NTV Telugu

వైరల్: ఈ చేప వయసు 226 సంవత్సరాలు… ఎప్పుడు పుట్టిందో తెలుసా?

మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే 60 నుంచి 80 సంవత్సరాలు అని చెప్తారు.  అదే తాబేలు 300 సంవత్సరాల వరకు జీవిస్తుంది.  కుక్క 15 ఏళ్ళు, ఇతర జీవులు వాటి జీవన ప్రమాణాన్ని బట్టి లైఫ్ టైమ్ ఉంటుంది.  అయితే, చేప ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే చెప్పడం కష్టం.  నీళ్ళల్లో కాలం వెళ్లదీసే చేపల ఆయుర్ధాయం తీసుకుంటే సాధారణ చేపలు 3 నుంచి 5 ఏళ్ల వరకు జీవిస్తుంది.  ఇక క్యాట్ ఫిష్ 60 ఏళ్ల వరకు ఉంటుంది.  కోయి జాతికి చెందిన చేపలు గరిష్టంగా 40 ఏళ్ల వరకు జీవిస్తుంది.  అయితే, కోయి జాతికి హనాకో అనే చేప ఏకంగా 226 ఏళ్ళు జీవించింది.  1751లో పుట్టిన ఈ చేప 1970 వరకు జీవించినట్టు ఆధారాలు ఉన్నాయి.  ఈ చేపను డాక్టర్ కొమోయి అనే వ్యక్తి పెంచుకున్నాడు.  ఆ చేప పూర్వీకుల కాలం నుంచి వారసత్వంగా వస్తున్నదట.  1970 లో ఈ చేప మరణించింది.  ఆ తరువాత చేప యొక్క వయసును తెలుసుకోవడానికి జంతుశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ మసయూకి అమానో ను సంప్రదించాడు.  అయన తన శాస్త్రపరిజ్ఞానంతో దాని వయసును లెక్కించి షాక్ అయ్యాడు.  చేప మరణించే సమయానికి దాని వయసు 256 సంవత్సరాలని నిర్ధారించారు.  ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు జీవించిన చేపగా ఇది రికార్డ్ సృష్టించింది. 

Exit mobile version