మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా పెర్సెవెరెన్స్ రోవర్‌ను గతంలో ప్రయోగించింది. ఈ రోవర్ గతేడాది ఫిబ్రవరి 18 వ తేదీన మార్స్ గ్రహంపై ల్యాండ్ అయింది. రోవర్ మార్స్ పై పరిశోధనలు చేపట్టడం ప్రారంభించి నేటికి ఏడాది కావడంతో నాసా శుభాకాంక్షలు తెలియజేసింది. రోవర్ తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆరుచక్రాలు కలిగిన ఈ రోవర్ మార్స్‌పై సంవత్సరం పాటు పరిశోధనలు చేసేలా రూపొందించారు. మార్స్‌పై ఒక ఏడాది అంటే భూమిపై 687 రోజులు అని అర్ధం. రోవర్ అరుణగ్రహం నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని విశ్లేషించి డేటాను భూమిపైకి పంపడమే కాకుండా, ఆ శాంపిల్స్‌ను రోవర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యూబ్‌లలో భద్రపరుచుతుంది.
Read: Viral: స్కూటీ కొనుడు ఏమోగాని… ఆ డబ్బులు లెక్కేసేసరికి వాళ్ల నడ్డి విరిగింది…
భవిష్యత్తులో మానవాళి అక్కడికి చేరుకుంటే, ఆ రోవర్ లోని ట్యూబ్‌ల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిక్షీంచేందుకు వీలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక, ఈ రోవర్‌లో 23 కెమెరాలు, 2 మైక్రోఫోన్లు ఉన్నాయి. మార్స్‌పై వీచే మార్టిన్ గాలులను వీడియో రూపంలో బంధించేందుకు, ఆ సౌండ్‌ను రికార్డ్ చేసేందుకు ఈ కెమెరాలు, మైక్రోఫోన్లు ఉపయోగపడతాయి. ఏడాది కాలంగా కొనసాగుతున్న రోవర్ పరిశోధనలో ఎప్పుడో అంతరించిపోయిన ఓ లేక్‌ను గుర్తించింది. అదేవిధంగా కొన్ని రాకాల రాళ్లలో కార్బన్, కొన్ని రకాల కెమికల్స్ ఉన్నట్టు గుర్తించింది.