Site icon NTV Telugu

Monkey Smart Snatchings:మేజిస్ట్రేట్ కే టోకరా ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?

Monkesy

Monkesy

కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోతులు చేసే అల్లరి మామూలుగా వుండదు.. దేవాలయాలు, ఇళ్ళు, ప్రధాన రహదారుల్లో కోతులు హల్ చల్ చేస్తుంటాయి. మధుర జిల్లాలోని బృందావన్ ఇరుకైన సందులలో వారసత్వ భవనం దగ్గర ఒక కోతి నానా అల్లరి చేసింది. ప్రహరీ గోడపై కూర్చున్న కోతి చాలా చురుకుగా వ్యవహరించింది. అక్కడే ఫోన్ లో మాట్లాడుతున్న మధుర జిల్లా కలెక్టర్ కం మేజిస్ట్రేట్ కళ్లజోడును, ఓ పోలీసు టోపీని దొంగిలించింది. ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఆ వానరం ఆ పనిచేసింది.రోడ్లపై వెళ్లేవారి చేతుల్లో ఏం వున్నా వాటిని లాగేసుకోవడం వాటికి అలవాటు. ఒక్కోసారి అవి గాయపరుస్తుంటాయి.

Read Also:
International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!

ప్రముఖ ఆలయ పట్టణం బృందావన్‌లోని ప్రజలు చాలా కాలంగా కోతుల బెడదతో సతమతం అవుతున్నారు. మేజిస్ట్రేట్‌ ఫోన్‌లో ఉండగా కోతులు కళ్లద్దాలు ఎత్తుకెళ్లడంతో ఆయన వాటికోసం వెతికారు. బృందావన్‌లోని శ్రీ బాంకే బెహారీ మందిర్‌కు వెళ్లే మార్గాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోతికి రెండు ప్యాకెట్ల మామిడిపండ్లు లంచం ఇచ్చిన తర్వాతే ఆయనకు తన కళ్లద్దాలు తిరిగి వచ్చాయి. భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఈ కోతుల బెడద మామూలుగా వుండదు.

2019లో ఎంపీ హేమమాలిని లోక్‌సభలో కోతుల బెడద అంశాన్ని లేవనెత్తారు. ఈ సమస్య పార్లమెంటులో చర్చించబడిన తర్వాత, మథుర మునిసిపల్ బాడీ పునరావాసం కోసం 100 కోతులను పట్టుకుంది, కానీ మైదానంలో వాటిని వదిలేసింది. తిరిగి మళ్ళీ అవి తమ పాత ప్రాంతాలకు వచ్చేసి తమ అల్లరి మొదలెట్టాయి. అడవుల నరికివేత కారణంగా కోతులు మానవుల అలవాట్లను ఎంచుకోవడం ప్రారంభించాయి. వారికి ఇప్పుడు పండ్లు అక్కర్లేదు, కానీ సమోసా మరియు ఫ్రూటీ ఇస్తే సరిపోతుంది. దేశంలో పలు ప్రాంతాల్లో మంకీ సఫారీని అభివృద్ధి చేయాలని హేమమాలిని సూచించారు.

Read Also:Central Governement: ప్యాకెట్‌లో ఎంత నూనె ఉందో కచ్చిత సమాచారం ముద్రించాలి.. ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు

Exit mobile version