మ్యాజిక్ ను ఎవరు చేసినా అవాక్కవుతాం. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మాములు మనుషులతో ఆటు జంతువులు కూడా అప్పుడప్పుడు మ్యాజిక్‌ను చూసి షాక్ అవుతుంటాయి. జూకు వెల్లిన ఓ యువతి కోతి ముందు ఓ అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్‌ను చూసి షాకైన ఆ కోతి విచిత్రంగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. ఈ జూకు వెళ్లిన ఓ విజిటర్ కోతి ముందు ఓ ట్రిక్‌ను ప్లే చేశారు. ఆ ట్రిక్‌ను చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది. తానే మ్యాజిక్ చేసినట్టుగా ఫీలయ్యింది. కోతి చేష్టలకు సోషల్ మీడియా ఫిదా అయ్యింది.
Read: ఆ కోట ఖరీరు కేవలం రూ. 88 మాత్రమే…