NTV Telugu Site icon

ఆ గ్రామంలో పాలు, పెరుగు ఫ్రీ… ఎందుకంటే…

దేశంలో పాలు, పాల ఉత్ప‌త్తుల‌కు కొద‌వ‌లేదు. ఏ ప్రాంతంలో అయినా 24 గంట‌లు పాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో లీట‌రు పాలు రూ. 40 నుంచి రూ.60 వ‌ర‌కు ప‌లుకుతున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డా పాలు ఉచితంగా ఇవ్వ‌రు. పాలు ఉచితంగా కావాలి అంటే అనంత‌పురం జిల్లాకు వెళ్లాల్సిందే. అనంత‌పురం జిల్లాలోని తాడిమ‌ర్రి మండ‌లానికి 23 కిమీ దూరంలో చిల్ల‌వారిప‌ల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 400 కుటుంబాలు నివ‌శిస్తున్నాయి. అక్క‌డ పాల‌కు ఏ మాత్రం లోటు ఉండ‌దు. రోజుకు వంద‌లాది లీట‌ర్ల పాలు ఆ గ్రామం నుంచి ఉత్ప‌త్తి అవుతాయి. కానీ,అక్క‌డ పాల‌ను అమ్మ‌రు.

Read: విచిత్రం: అవి ప్రాణాల‌తో ఉన్నా చ‌నిపోయిన‌ట్లుగా ప‌డిపోతున్నాయి.. కార‌ణం ఇదే…

అడిగిన‌వారికి కాద‌న‌కుండా ఉచితంగా ఇస్తారు. వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి ఇలా ఉచితంగా పాల‌ను అందిస్తున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. పూర్వం ఈ గ్రామంలో కాటికోటేశ్వ‌ర‌స్వామి పాల కుండ‌లో న‌వ‌యువ‌కుడిగా ద‌ర్శ‌నం ఇచ్చార‌ట‌. దీంతో గ్రామ‌స్తులు ఆయ‌న‌కు గుడి క‌ట్టారు. మ‌హాశివ‌రాత్రి రోజున పెద్ద ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. పాల‌కుండ‌లో కాటికోటేశ్వ‌ర స్వామివారు క‌నిపించిన‌ప్ప‌టి నుంచి ఆ గ్రామంలో పాల‌ను అమ్మ‌డంగాని, కొనుక్కోవ‌డంగాని చేయ‌ర‌ని, ఎవ‌రు అడిగితే వారికి ఉచితంగా పాల‌ను ఇస్తామ‌ని చెబుతున్నారు. ఎవ‌రైనా పాల‌ను అమ్మితే వారికి అరిష్టం అని అక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.