Site icon NTV Telugu

Super Hotel: ఆర్డ‌ర్ చేసిన 13 సెక‌న్ల‌లోనే టేబుల్ ముందుకు…

హోట‌ల్ కి వెళ్లి ఏదైనా ఆర్డ‌ర్ చేస్తే టేబుల్ ముందుకు రావ‌డానికి క‌నీసం 10 నిమిషాల స‌మ‌య‌మైనా ప‌డుతుంది. కొన్నిచోట్ల అంత‌కంటే ఎక్కువ స‌మ‌య‌మైనా ప‌ట్ట‌వ‌చ్చు. కాకా హోట‌ల్‌కి వెళ్లినా కావాల్సింది ఇవ్వ‌డానికి రెండు మూడు నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఆర్డర్ చేసింది క్ష‌ణాల్లో టేబుల్ ముందుకు రావాలంటే కుద‌ర‌ని ప‌ని. అయితే, మెక్సికో లోని క‌ర్నే గారిబాల్డీ అనే హోట‌ల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ హోట‌ల్‌లో ఏ ఫుడ్ ఆర్డ‌ర్ చేసినా క్ష‌ణాల్లోనే టేబుల్ ముందుకు వచ్చేస్తుంది. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా స‌ర్వ్ చేసే రెస్టారెంట్‌గా దీనికి పేరు వ‌చ్చింది. ఫుడ్ ఆర్డ‌ర్ చేసిన 13 సెక‌న్ల‌లోనే టేబుల్ ముందు ఉంచుతారు.

Read: Mahalinga Nayak: నీళ్ల కోసం ఏకంగా ఏడు సొరంగాలు త‌వ్వాడు… ప‌ద్మ‌శ్రీ సాధించాడు..

ఎంత బిజీగా ఉన్నా టైమ్‌కి స‌ర్వ్ చేస్తుంటారు. ఇదే ఈ హోట‌ల్ ప్ర‌త్యేక‌త‌. ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌ను 13.5 సెక‌న్ల‌లోనే స‌ర్వ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్‌లో చోటు సాధించింది. ఎంత ఆల‌స్యం అనుకున్నా 15 సెక‌న్ల కంటే ఎక్కువ స‌మ‌యం తీసుకోరు. 1996 నుంచి ఈ హోట‌ల్ ఇంతే స్పీడుగా స‌ర్వ్ చేస్తున్న‌ది. మెక్సిక‌న్ ఫుడ్ త‌యారు చేయ‌డానికి సాధార‌ణంగా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. ఎంత క‌ష్ట‌మైన ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేసినా క్ష‌ణాల్లో సిద్ధం చేసి స‌ర్వ్ చేయ‌డం ఈ హోటల్ ప్ర‌త్యేక‌త‌. అందుకే క‌ర్నేగారిబాల్డీ హోట‌ల్ మెక్సికోలో ఫేమ‌స్ అయింది.

Exit mobile version