NTV Telugu Site icon

ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వ‌ధూవ‌రులు… నెటిజ‌న్లు ఫిదా…

పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సాంగ్ దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయింది. నెటిజ‌న్లు ఈ సాంగ్‌కు అనేక పేర‌డీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమ‌స్ అయింది. ఈ సాంగ్‌కు వ‌ధూవ‌రులు చేసిన డ్యాన్స్ వైర‌ల్‌గా మారింది. రోన‌క్ షిండే, ప్రాచీమోర్ అనే నూత‌న వ‌ధూవ‌రులు ఊ అంటావా ఉహు అంటావా అంటూ వేసిన స్టెప్స్ వైర‌ల్ అయ్యాయి. మ‌రాఠీ సాంప్ర‌దాయ పెళ్లి డ్ర‌స్‌లో నూత‌న వ‌ధూవ‌రులు చేసిన హాంగామాను చూసి బంధువులు ఆశ్చ‌ర్య‌పోయారు. వీరితో పాటు కొంత‌మంది బంధువులు కూడా ఆ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. వధూవ‌రులు చేసిన డ్యాన్స్ సూప‌ర్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Read: రైల్వేశాఖ‌కు కాసులు తెచ్చిపెడుతున్న ఓ న‌యా ఐడియా…

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయిండి