కరోనా కాలంలో సాఫ్ట్‌వేర్‌మొదలు చాలా రంగాలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. ఐటీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటిదగ్గర నుంచి ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. అనుకున్న విధంగా వర్క్ ముందుకు సాగదు. ఇంట్లో ఇబ్బందులు సహజమే. అయితే, యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తూ అక్షరాల ఏడాదికి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడట. అతను 6 కంపెనీలకు ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆరూ ఫుల్‌టైమ్ జాబ్స్ కావడం విశేషం. వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఆరు రకాల ఉద్యోగాలు చేసే అవకాశం దొరికిందని, అన్నింటిని మ్యానేజ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. మిలినియర్ కావాలన్నది తన కల అని, 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సదరు వ్యక్తి రెడిట్ బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.
Read: Viral: చీరకోసం కొడుకు ప్రాణాలను పణంగా పెట్టిన మహిళ… ఏమాత్రం జారినా..
