NTV Telugu Site icon

క్యూలో నిల‌బ‌డితే చాలు… రోజుకు రూ. 16 వేలు ఇస్తార‌ట‌…

క‌రోనా కాలంలో ల‌క్ష‌లాది మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు.   ఉద్యోగాలు కోల్పోవ‌డంతో  ప్ర‌జ‌లు అనే ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.  ఏ ప‌ని దొరికితే ఆ ప‌ని చేస్తున్నారు.  ప‌నికోసం పాట్లు ప‌డుతున్నారు.  అయితే, బ్రిట‌న్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్య‌క్తి వెరైటీగా ప‌నిచేస్తే రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.  అదెలా అంటే, రోజులో గంట‌ల కొద్ది క్యూలైన్లో నిల‌బ‌డ‌టం.  గంట‌ల కొద్ది క్యూలైన్లో నిల‌బ‌డి త‌న వంతు వ‌చ్చిన త‌రువాత కావాల్సివ వ‌స్తువుల‌ను కొని తీసుకొని వెళ్ల‌డ‌మే.  ఇలా కొనుగోలు చేసిన వ‌స్తువులను ఎవ‌రైతే కొనుగోలు చేయ‌మ‌న్నారో వారికి అందిస్తాడు.  దానికి ప్ర‌తిగా అత‌నికి రూ. 16 వేల వ‌ర‌కు అందిస్తార‌ట‌.  ధ‌న‌వంతులైన వారికి తాను ఈ సేవ చేస్తు డబ్బులు సంపాదిస్తున్న‌ట్టు ఫ్రెడ్డీ పేర్కొన్నాడు.  ఖ‌రీదైన వ్య‌క్తులు గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్లో నిల‌బడ‌లేరు.  అంత స‌మ‌యం కూడా ఉండ‌దు.  అందుకే తాను ఈ సేవ‌ను ఎంచుకున్నాన‌ని ఫ్రెడ్డీ తెలియ‌జేశాడు.  

Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా… ఆరోగ్యం బాగోలేదని లేఖ