అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రతీ రాష్ట్రం ఒక్కో నెంబర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసులు స్పందించి సహాయం చేస్తారు. అయితే, కొంతమంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరదాగా కాల్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి సహాయం కావాలని అడిగాడు. పాపం నిజమే అనుకున్న పోలీసులు హుటాహుటిన తాగుబోతు కాల్ చేసిన ప్రాంతానికి వెళ్లి ఎందుకు కాల్ చేశావని అడిగితే, ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
Read: Naveen Chandra: ప్రేమికుల రోజున భార్యను పరిచయం చేసిన స్టార్ హీరో
సాయంత్రం 5 గంటలకు రైళ్లు, కార్లు తిరగకపోవడంతో అసలు పోలీసులు పనిచేస్తున్నారా లేదో అనుమానం వచ్చిందని, అందుకే కాల్ చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి రాయ్‌పురానీలోని తప్రియా గ్రామానికి చెందిన నరేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నెంబర్ ఉందికదా అని ఫోన్ చేయకూడదని, ఏ సమయాల్లో ఫోన్ చేయాలో తాగుబోతుకు వివరించి జాగ్రత్తగా అతడిని ఇంటివద్ద దించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
