Site icon NTV Telugu

Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

Bird Feeding

Bird Feeding

కొన్ని సార్లు మంచి చేసే ఉద్దేశంతో ఏదైనా చేసినా.. అది కొందరికి నచ్చక పోవచ్చు.. అది నేరం కూడా కావొచ్చు.. మరోవైపు, మనం చేసే పని ఇరుగు పొరుగువారికి నచ్చకపోయినా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.. అందుకు ఉదాహరణే అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్లు దాటిన వ్యక్తికి ఎదురైన అనుభవం.. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే.. తన ఇంటి దగ్గర పక్షుల ఆహారం పెట్టడమే.. అదే అతడిని జైలుకు వెళ్లేలా చేసింది.. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చగా మారిపోయింది.

Read Also: WHO: 6 నెలలకో కొత్త వేవ్‌..! డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు

అమెరికాలో డోనాల్డ్ అంటాల్‌ (71) అనే వ్యక్తి పక్షులు అంటే ప్రాణం.. వాటి కోసం తన ఇంటి ముందు ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే గింజలను ఆహారంగా పెడుతూ వస్తున్నాడు.. అయితే, ఇది నచ్చని స్థానికులు కొందరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.. పక్షుల కోసం ట్రైలు పెడుతున్నారు.. ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం నేరం అని అభియోగులు మోపారు.. మరోవైపు.. పక్షుల ఆహారం పెడుతోన్న ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన వ్యవహారం నెట్టింట్లలో వైరల్‌గా మారగా.. మంచి చేయరు.. పక్షులకు ఆహారం పెట్టిన ఆ పెద్దాయన చేసిన నేరం ఏంటి అంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు.

Exit mobile version