Site icon NTV Telugu

lovers Romance Bus-stand- మీరెక్కడా తయారయ్యారా బాబు.. ఎక్కడ పడితే అక్కడేనా…

Untitled Design (11)

Untitled Design (11)

ఈ మధ్య ప్రేమ అనే పదానికే అర్థం మారిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేమ అనేది ఇద్దరు మనసులు కలిసేది.. కానీ ప్రస్తుతం దానికి అర్థం మార్చేస్తున్నారు ఇప్పటి యూత్.. ప్రేమ పేరుతో వారు చేసే వికృత చేష్టలకు వారిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రేమికులు.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో చేయకూడదో అర్థం కావడం లేదు. . ఇటీవల ఎక్కడబడితే అక్కడ అడ్డుఅదుపు లేకుండా ప్రేమికులు అసహ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ప్రేమికులిద్దరూ పట్టపగలు బస్ స్టాండ్‌లో ప్రేమాయణంలో మునిగిపోయారు.

మెట్రో, రైలు, బస్సు, పార్క్ వంటి ప్రజా ప్రయాణ రవాణా సాధనాల్లో మాత్రమే కాదు.. పార్కులు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రేమికులు ప్రపంచంలో మాకు సంబంధం లేదు అన్నట్లు ముద్దులు, ప్రేమ, సరసాలతో మునిగి పోతుంటారు. చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారు అనే బుద్ది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. గట్టిగా ఎవరైనా నిలదీస్తే.. నీకెందుకు అంటూ.. ఎదురు తిరుగుతున్నారు.
ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బస్టాండ్‌లో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అసలు ఎవరైనా చూస్తారు అన్న ఆలోచన లేకుండా బరితెగిస్తున్నారు. వీళ్లని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి.. ఏర్పడింది.

ఈ వీడియోలో.. ఇద్దరు ప్రేమికుల బస్టాండ్ లో గడిపిన మధురమైన క్షణాలు రికార్డ్ అయ్యాయి. ప్రేమికులిద్దరూ పట్టపగలు బస్ స్టాండ్ లో బిజీ బిజీ గా ప్రేమలో ఉన్నారు. ఒక యువకుడు తెల్లటి చీరలో ఉన్న ఒక యువతిని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. మొదట ఆమె అతని చెంపను తట్టి “ఒల్లె” అని చెప్పి ఆ యువకుడితో సరసాలాడుతుంది. కొంతమంది ప్రయాణీకులు బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే ఈ ప్రేమ పక్షులకు ప్రపంచంతో పని లేదు.. తాము ఎక్కడ ఉన్నామనే సోయ లేనట్లు ఉంది.

Exit mobile version