NTV Telugu Site icon

Boy Saves His Mother: తల్లిని రక్షించిన చిన్న పిల్లవాడు.. నోటిజన్లు ట్రోల్‌

Littile Boye

Littile Boye

Boy Saves His Mother: పిల్లలు చేసే పని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారు చేసే చిలిపి చేష్టలు చూసి ఇతనికి మీఅలవాటు అంటూ నవ్వుకుంటుంటారు. కానీ వాళ్లు చేసే కొన్ని పనులు అలవాట్లు మాత్రం తల్లిదండ్రులకే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పిల్లలు కిందపడుతున్నప్పుడు తల్లిదండ్రులు వారిని కాపాడుతున్న వీడియోలు మనం చూస్తుంటాము. ఆవీడియోలను మళ్లీ కామెంట్‌ చేస్తూ వావ్‌ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రతగా ఉంటారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అంటూ తెగ కామెంట్‌ చేస్తూంటారు. ఇదిరోటీన్‌ తల్లినే చిన్న పిల్లలు కాపాడితే ఇక ఆతల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. నాముద్దుల కొడుకు, నాగారాల పట్టి అంటూ ముద్దులతో ముంచెత్తుతారు. అలాంటి వీడియోలు నెటిజన్లుచూస్తే ఇక కామెంట్ల గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓతల్లి తన గ్యారేజ్‌ లో గ్యారేజ్‌ డోర్‌ రిపేర్‌ చేసేందుకు నిచ్చన వేసుకుని పైకి ఎక్కింది దాని పట్టుకుని ఏదో రిపేరీ చేస్తుంది.

కిందనే బుడ్డోడు ఏదో సర్దుకుంటూనో లేక ఏదో చూస్తు నిలబడ్డాడు. అయితే ఒక్కసారిగా ఆమె గ్యారేజ్‌డోర్‌ ను పట్టుకుని కింద నిచ్చన కళ్లకు మిస్సై నిచ్చన కింద పడిపోయింది. కానీ ఆతల్లి మాత్రం ఆగ్యారేజ్‌ డోర్‌ పట్టుకుని వేలాడు తోంది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. కింద పడిపోతానేమో అంటూ భయపడుతుంది. కిందపడితే దెబ్బలు కాయం ఎందుకంటే ఆమె అంత ఎత్తులో ఉంది. అయితే అది గమనించిన బుడ్డోడు తన తెలివి ఉపయోగించి అంత బరువున్న నిచ్చెనను ఎత్తడం మొదలు పెట్టాడు. కానీ తన వల్ల కావడంలేదు ఆచిన్న పిల్లాడు అయినా తన తల్లిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. తన తల్లి కిందపడకుండా చేయాలని తెగించి చివరకు ఆనిచ్చెనను ఎత్తి తల్లికాళ్లదగ్గరకు పెట్టాడు. దీంతో ఆతల్లి ఊపిరిపీల్చుకుంది. నిచ్చెనపై కాళ్లుపెట్టి వేలాడుతున్న తల్లి తన బుడ్డోడును చూస్తూ మరోజన్మ ఇచ్చావు అన్నట్లు ఆమె చూపులోనే అర్థమవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. అయితే ఈవీడియోను ఒక నెటిజన్‌ పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు నువ్వు హీరో బుడ్డోడా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఏదైతేనేం బుడ్డోడు చేసిన పనికి షభాస్‌ అనాల్సిందే. ఆ వీడియోను మీరు ఒకలుక్‌ వేయిండి.
Explosion: ఇటుక బట్టీలో చిమ్నీ పేలి ఏడుగురు కూలీలు మృతి

Show comments