Site icon NTV Telugu

Lioness Fight: దున్న కోసం సింహాల పోరు.. సీన్‌ కట్ చేస్తే..

Lioness Fight

Lioness Fight

Lioness Fight: సింహాలు.. అడవి దున్నను వేటాడి గుప్పిట్లో పెట్టుకున్నాయి. అప్పుడే.. ఆడ సింహాలు ప్రవేశించడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఇలాంటి సీన్ ఎవరూ చూసి ఉండరు.. ఇది చూస్తే.. ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వ్యక్తి లాభపడతాడు.. ఇందులోనూ అదే సీన్ కనిపిస్తుంది. ఆడ, మగ సింహాల మధ్య జరిగిన భీకర పోరులో ఒకరు మాత్రం సేఫ్ అయ్యింది. ఇలాంటి ఘటనలు మనుషుల్లోనూ.. వన్యప్రాణుల్లోనూ కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సింహాలు.. కడుపు నింపుకోవడానికి భారీ జంతువులను వేటాడతాయి. ఇలాంటి దృశ్యాలు మనం తరచుగా చూస్తుంటాం.. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, వేటాడిన తర్వాత సింహాలన్నీ స్వార్థపూరితంగా పోరాడడం ప్రారంభించాయి. ఈ షాకింగ్ సీన్‌తో.. వారి చేతిలో ఉన్న ఆహారం.. నోటికి రాలేదు. సింహాల గుంపు దున్నను వేటాడి పట్టుకుంటాయి. ఈ సమయంలో.. ఆడ సింహాలు అక్కడికి చేరుకుంటాయి. వారు ఆహారం కోసం ఘర్షణ పడతారు. ఆడ సింహాల మధ్య భీకర పోరు జరుగుతుంది. అప్పటికే సింహాల దాడిలో గాయపడిన అడవి దున్న హాయిగా లేచి అక్కడి నుంచి ఏమీ జరగన్లు వెళ్లిపోయింది.

సింహాలు వేట కోసం పోరాడుతున్న తీరును ఇప్పటివరకు చూడలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వైరల్ వీడియోను @OTerrifying అనే యూజర్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిని లైక్ చేయడంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దున్న సేఫ్‌ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. దున్నకు ఇంకా నూకలున్నాయి. వారిలో వారే కొట్టుకుంటే ఇదిగో నోటికాటికి వచ్చిన అన్నం కూడా ఇలానే ఎల్లిపోద్దంటూ కమెంట్లు పెడుతున్నారు.
SP Anburajan : అనూష ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే

Exit mobile version