Site icon NTV Telugu

Viral: పైథాన్ వ‌ర్సెస్ చిరుత‌… విజ‌యం ఎవ‌రిదంటే…

సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్ యానిమ‌ల్స్ కు సంబంధించిన వీడియోలు అధికంగా నెటిజ‌న్లు లైక్ చేస్తుంటారు. సింహం పులి పోటీ ప‌డ‌టం, పాము ముంగీస వంటివి ఫైట్ చేసుకోవ‌డం వంటి వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు కొండ చిలువ, చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది. ఓ చెరువు ద‌గ్గ‌ర ఆహారం కోసం వెతుకుతున్న చిరుత‌కు కొండ‌చిలువ క‌నిపించింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా ఆ పైథాన్‌ను నోట క‌రుచుకున్నంది.

Read: Shruti Haasan: ఆ పాత్ర చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను

అయితే, ఆ పైథాన్ త‌న బ‌లంతో చిరుత‌ను చుట్టెయ్యాల‌ని ప్ర‌య‌త్నించింది. ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సాధ్యం కాలేదు. చిరుత త‌న పంజాదెబ్బ‌లు రుచిచూప‌డంతో కొండ‌చిలువ తీవ్రంగా గాయ‌ప‌డింది. అక్క‌డి నుంచి ఆ చిరుత కొండ‌చిలువ‌ల‌ను గ‌ట్టుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ వీడియోను వైల్డ్ యానిమ‌ల్ క్రియేష‌న్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతున్న‌ది.

Exit mobile version