Site icon NTV Telugu

Guinness Record : పేక ముక్కలతో రికార్డ్‌ సృష్టించిన 15 ఏళ్ల బాలుడు

Record

Record

Guinness Record : ఈ రోజుల్లో పిల్లలు ఎంత టాలెంటెడ్‌గా ఉంటారో చెప్పలేం. పెద్దలకైనా సాధ్యం కానివాటిని చిన్నపిల్లలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అటువంటి ఓ బాలుడు కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోల్ కత్తాకు చెందిన 15 ఏళ్ల అర్ణవ్ డాగా అనే బాలుడు పేక ముక్కలతో ఇల్లు కట్టేసి, అది కూడా గిన్నిస్ బుక్‌లో నాలుగు రికార్డులు సాధించాడు. 2023 అక్టోబర్ 14న అర్ణవ్ డాగా తన ప్రతిభను చాటాడు. ఎలాంటి గమ్, టేప్ లేకుండా.. కేవలం పేక ముక్కలతోనే 1.43 లక్షల పీసులు ఉపయోగించి అక్షరాలా 40 ఫీట్ల ఎత్తైన టవర్ ను కట్టేశాడు. ఏకంగా 24 గంటల్లోనే నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాడు.

CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!

అర్ణవ్ ఈ అద్భుతాన్ని సాధించిన తరువాత గిన్నిస్ సంస్థ కూడా ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెచ్చుకుంది. “ఒకే రోజులో నాలుగు రికార్డులు బ్రేక్ చేయడం చాలా గొప్ప విషయం” అని చెప్పింది. అర్ణవ్ ఏకాగ్రత, పట్టుదలకి అందరూ ఫిదా అయ్యారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. 17,000కి పైగా వీక్షణలు, ఎన్నో కామెంట్లు, హార్ట్ ఎమోజీలతో ప్రశంసలు తెలుపుతున్నారు. ఒకరైతే “అబ్బాయి అందరికి రోల్ మోడల్!” కామెంట్ చేయగా.. మరొకరు.. “నీ ఫోకస్, నీ విజయం అదిరిపోయింది..!” అని, “మన ఇండియన్ టాలెంట్ అంతే బాసూ!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దవాళ్లకి సైతం అసాధ్యమనిపించే పని.. 15 ఏళ్ల అర్ణవ్ డాగా ఇలా సింపుల్‌గా చేసి చూపించాడు. అతని పేరే కాదు, మన దేశ ప్రతిభ కూడా ప్రపంచం దృష్టిలోకి తీసుకురావడంలో ఇది పెద్ద అడుగు.

Emirates Draw : లాటరీలో 231 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన చెన్నై వ్యక్తి..!

Exit mobile version