Site icon NTV Telugu

Nikola Kid: ఒంట‌రి వ్య‌క్తులు… పెద్ద‌వారి కోస‌మే…

ప్రాణం ఉన్న వ్య‌క్తులు హావ‌భావాలు ప‌లికించ‌డం చాలా క‌ష్టం. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రాణం లేని బొమ్మ‌లు సైతం మ‌నిషికి ఔరా అనిపించే విధంగా హావ‌భావాలు ప‌లికిస్తున్నాయ‌ట‌. దీనిని జ‌పాన్ కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు త‌యారు చేశారు. దీనిపేరు ఆండ్రాయిడ్ నికోలా కిడ్‌. మ‌నుషుల‌తో క‌నెక్ట్ అయ్యేందుకు ఈ రోబోల‌ను త‌యారు చేశార‌ట‌. ఈ ఆండ్రాయిడ్ నికోలా కిడ్ 6 ర‌కాల హావ‌భావాల‌ను ప‌లికించ‌గ‌ల‌దు. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, అసహ్యం వంటి వాటిని ఈజీగా ప‌లికించ‌గ‌ల‌దు. ఈ ఆండ్రాయిడ్ నికోలా కిడ్‌ల‌ను ఒంట‌రి వాళ్ల‌ను చూసుకోవ‌డానికి, పెద్ద వ‌య‌సువారి బాగోగులు చూసుకోవ‌డానికి వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియ‌ల్ కండ‌రాల వ‌ల్ల ఈ హావ‌భావాల‌ను ప‌లికించ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

Read: Snow Marathon: మైస‌న్ 53 డిగ్రీల చ‌లిలో ప‌రుగులు…

Exit mobile version