Site icon NTV Telugu

Indian Army: మోకాళ్లలోతు మంచులో…ప్రాణాల‌కు తెగించి ప‌హారా…

దేశం కోసం ప్రాణాలను ప‌ణంగా పెట్టి నిత్యం బోర్డ‌ర్ లో ప‌హారా కాస్తుంటారు సైనికులు. మంచు ప‌ర్వ‌తాల్లో ప్రాణాల‌కు తెగించి ప‌హారా చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. పైనుంచి ద‌ట్టంగా కురిసే మంచుతో ఆ ప్రాంతాల‌న్ని క‌ప్ప‌బ‌డి ఉంటాయి. మంచులో న‌డుస్తుంటే కాళ్లు మోకాళ్ల లోతులో కూరుకుపోతుంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయినా స‌రే దేశంకోసం జ‌వాన్లు కాప‌లా కాస్తుంటారు. శ‌తృవుల నుంచి దేశాన్ని ర‌క్షిస్తుంటారు. అత్యంత క‌ఠోర‌మైన వాతావ‌ర‌ణంలో సైతం విధులు నిర్వ‌హిస్తూ దేశాన్ని కంటికి రెప్ప‌లా కాడుతున్న సైనికులకు సంబంధించిన దృశ్యాలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Read: Whatsapp: ఇలాంటి ఎమోజీలు పంపితే… భారీ జ‌రిమానా త‌ప్ప‌దు..

15 వేల అడుగుల ఎత్తులో మైన‌స్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో గ‌స్తీని నిర్వ‌హిస్తున్న దృశ్యాలు చూసిన భార‌తీయులు సెల్యూట్ చేస్తున్నారు. దేశ ర‌క్ష‌ణ‌లో వీర జ‌వాన్ల శౌర్యానికి, దృఢ సంక‌ల్పానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏముంటుంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. హిమాల‌యాల్లోని ఇండో చైనా స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను ఐటీబీపీ సైనికులు ప‌హారా కాస్తుంటారు. ఇక టిబెటిన్ బోర్డ‌ర్ నిత్యం ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతుంటాయి. మైన‌స్ 25 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో కూడా ఎలా మ‌నుగ‌డ సాగించాలి అనే విష‌యంపై సైనికుల‌కు శిక్ష‌ణ ఇస్తుంటారు. ప్ర‌స్తుతం మంచులో ప‌హారా కాస్తున్న దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

Exit mobile version