Site icon NTV Telugu

Mask: ఈ కార్టూన్‌ను చూస్తే… మాస్క్‌ను అస్సులు తీయ‌రు…

క‌రోనా కాలంలో మాస్క్ ఎంతగా ఉప‌యోగ‌ప‌డుతుంతో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మాస్క్ ధ‌రించ‌డం వ‌ల‌నే కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగ‌లిగారు. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్పటికీ మాస్క్ లేకుంటే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు. ఇరాన్ కు చెందిన కార్టూనిస్ట్ ఆయ‌త్ న‌దేరీ ఇస్‌ఫాహ‌న్ యూనివ‌ర్శిటీలో ఆర్ట్స్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. టీచింగ్ వృత్తితో పాటు ఆయ‌న సృజ‌నాత్మ‌కంగా గీసే కార్టూన్స్ ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందాయి. క్యారికేచ‌ర్ గ్రామ్‌, తాష్ ఆర్ట్స్ వంటి అకాడ‌మీల‌ను ఏర్పాటు చేసి నిత్యం కార్టున్ల‌పై శిక్ష‌ణ ఇస్తుంటారు.

Read: Snake in Flight: విమానంలో పాము… ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని…

ప్ర‌యాణం చేసే స‌మ‌యంలోనే త‌న‌కు కార్టూన్ కు సంబంధించిన ఐడియాలు వ‌స్తాయ‌ని, ఆ ఐడియాల‌ను ఫాలో అయితే చాల‌ని ఆయ‌త్ చెప్పుకొచ్చారు. ఏడు సోలో ఎగ్జిబిష‌న్‌ల‌ను ఏర్పాటు చేసిన ఆయ‌త్ త‌న తొలి కార్టూన్ ప‌ర్యావ‌ర‌ణంపై వేశారు. తాజాగా క‌రోనా కాలంలో ఆయ‌న మాస్క్ గొప్ప‌ద‌నాన్ని, ప్ర‌పంచంలోని మాన‌వాళిని ఎలా కాపాడిందో చెప్పేందుకు గీసిన కార్టూన్ ప్ర‌తిఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్న‌ది. మాస్క్ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించేందుకు ఈ కార్టూన్ చాల‌ని, భాష‌తో ప‌నిలేద‌ని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version