Site icon NTV Telugu

Hindustan Ki Antim Dukan : ఇండియాలో ఇదే చివ‌రి దుకాణం… ఆనంద్ మ‌హీంద్రా సైతం…

ఇండియా చైనా స‌రిహ‌ద్దుల్లో గ‌త కొన్ని రోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. రెండు దేశాల మ‌ధ్య పొడ‌వైన స‌రిహ‌ద్దు ఉన్న‌ది. రెండు దేశాల మ‌ధ్య ఖ‌చ్చిత‌మైన స‌రిహ‌ద్దులు లేక‌పోవ‌డంతో ర‌గ‌డ జ‌రుగుతున్న‌ది. చైనా బోర్డ‌ర్‌కు కూత‌వేటు దూరంలో ఓ టీ దుకాణం ఉన్న‌ది. చంద‌ర్ సింగ్ బ‌ద్వాల్ అనే వ్య‌క్తి గ‌త 25 ఏళ్లుగా ఈ దుకాణాన్ని న‌డుపుతున్నాడు. ఉత్త‌రాఖండ్‌లోని ఇండియా చైనా బోర్డ‌ర్‌లో ఉన్న చివ‌రి దుకాణం కావ‌డంతో దీనిని హిందుస్తాన్‌కి అంతిమ్ దుకాణ్ పేరుతో పిలుస్తున్నారు.

Read: Viral: సామీ సాంగ్‌కు గ‌ర్బిణీ డ్యాన్స్‌… సోష‌ల్ మీడియా ఫిదా…

అక్క‌డ బోర్డు కూడా ఇదే పేరుతో ఉంటుంది. ఈ దుకాణం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. అక్క‌డి వ‌చ్చిన టూరిస్టులు ఆ దుకాణం వ‌ద్ద నిల‌బ‌డి ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఈ దుకాణం య‌మా ఫేమ‌స్ అయింది. వ్యాపార రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మ‌హీంద్రా కూడా ఈ దుకాణం గురించి ట్వీట్ చేశారు. దేశంలో బెస్ట్ సెల్ఫీ పాయింట్ అని, అక్క‌డ ఒక క‌ప్పు చాయ్ తాగ‌డం మంచి అనుభూతిని ఇస్తుంద‌ని ట్వీట్ చేశారు.

Exit mobile version