ఈరోజుల్లో అసాధ్యం కానివాటిని కూడా సుసాధ్యం చేస్తూ అద్భుతమైన రికార్డులను కొందరు క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి స్పూన్లను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. బ్యాలెన్స్ చెయ్యడం అంటే చేత్తో పట్టుకొని కాదు.. ఒంటి మీద పెట్టుకొని కింద పడకుండా బ్యాలెన్స్ చేశాడు.. అలా ఒంటి మీద ఏకంగా 88 స్పూన్లను బ్యాలెన్స్ చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇరాన్‌కి చెందిన అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ అనే వ్యక్తి తన శరీరంపై అత్యధిక సంఖ్యలో స్పూన్‌లను బ్యాలెన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.. మాములుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం కోసం చాలామంది తహతహలాడతారు. వింత వింత టాలెంట్స్ ప్రదర్శిస్తూ రికార్డు సాధిస్తుంటాంరు. రీసెంట్‌గా అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ తన బాడీపై 88 స్పూన్స్ బ్యాలెన్స్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. 2022 లో తన పేరు మీద ఉన్న 85 స్పూన్స్ రికార్డును తిరగ రాశాడు…
ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈ వీడియోను షేర్ చేశారు.. మొన్నీమధ్య ఓ వ్యక్తి తలపై 319 వైన్ గ్యాసులను బ్యాలెన్స్ చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. వైన్ గ్లాసులు అమర్చబడిన ట్రేలను ఒక వ్యక్తి అరిస్టోటెలిస్ వాలారిటిస్ తలపై పెడతాడు. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అతను ముందుకు నడిచాడు. చివర్లో గ్లాసులన్నీ నేలపై పడటం కనిపిస్తుంది.. ఆ తర్వాత స్పూన్స్ ను ఇలా పెట్టుకొని ఓ వ్యక్తి చెయ్యడంతో అతను మరో రికార్డ్ ను బ్రేక్ చేశాడు.. ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి..