కొంత మందికి వింత చేష్టలంటే చాలా ఇష్టం. అంటే కోతిచేష్టలన్న మాట. అలాంటిదే ఇది కూడా. లేకపోతే మ్యాగీ మిల్క్‌షేక్ ఏంటి? దానికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజెన్లు దానిని అసహ్యించుకుంటున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మ్యాగీ చాలా మందికి ఫేవరెట్ ఇనిస్టెంట్ వంటకం. అర్థరాత్రి అపరాత్రి అని లేదు..జస్ట్ ఫైవ్ మినిట్స్‌లో రెడీ టూ ఈట్. ఈ జనరేషన్ వారు దీనిని విపరీతంగా ఇష్టపడతారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది వారి జీవితంలో అంతర్భాగం. ఎన్నో జ్ఞాపకాలు దానితో ముడిపడి ఉంటాయి. తాజాగా ఓ మ్యాగీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాగిని మిల్స్‌షేక్‌తో కలిపిన ఫొటో అది. ఆ పిక్ చూసిన తీవ్రంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌లో దీనిపై నెటిజన్లు చాలా సీరియస్‌గా రియాక్టవుతున్నారు.
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. నిజమే..కాని మరీ ఇంత ఓవరా? ఇలాంటివి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. మ్యాగీని రకరకాలుగా ట్రై చేస్తుంటారు. వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతుంటాయి. ఇంతకు ముందు దీనిని పానీపూరీతో కలిపి వండారు. అలాగే మ్యాగీ పులిహోరా, మ్యాగీ ఉప్మా, మ్యాగీ ఫ్రై ఇలా ఎన్నో వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మ్యాగీ మిల్క్ షేక్ చేయటం పిచ్చి పీక్స్‌కు పోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతం మిల్క్ షేక్ మ్యాగీ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మ్యాగిని ఇష్టపడుతుంటారు. రుచికరమైన మ్యాగీని రెడీ చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. అందుకే ఇన్ని దానిని తమ ఇష్టం వచ్చినట్టు చేసుకుని తింటున్నారు!!