NTV Telugu Site icon

హగ్ తో స్కూబా డైవర్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన సీల్… వీడియో వైరల్

Friendly seal gives tight hug to scuba diver

మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అది అవసరం కూడా… ఇదే విషయాన్ని తెలియజేసింది ఒక సీల్. సాధారణంగా సముద్రాల్లో సీల్ చేపలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ స్కూబా డైవర్ సముద్రంలో డైవింగ్ కు వెళ్లగా… అక్కడ ఓ సీల్ అతన్ని కౌగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అంతేకాదు ఆ సీల్ సదరు స్కూబా డైవర్ చేతులను పట్టుకుని హాగ్ చేయసుకోమని అడుగుతోంది కూడా. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను భారత అటవీ సేవా అధికారి సుశాంత నందా గురువారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆయన ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే భారీ సంఖ్యలో లైకుల వర్షం కురిసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.