Site icon NTV Telugu

Interesting Fact: చనిపోయిన తర్వాత కూడా గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయి

Hairs Fingernails Growth

Hairs Fingernails Growth

ఒక మనిషి చనిపోయాకా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.. శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోయి, రక్తం చల్లబడటం ప్రారంభమవుతుంది.. శరీరం కూడా గట్టి పడుతుంది.. ఓవరాల్‌గా బాడీలో ఎలాంటి మూవ్‌మెంట్ ఉండదు.. అలాంటప్పుడు గోర్లు, వెంట్రుకలు ఎలా పెరుగుతాయి? అని అనుకుంటున్నారా! మీరు నమ్మినా, నమ్మకపోయినా.. ఇది మాత్రం వాస్తవం. చనిపోయిన తర్వాత కూడా గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయని సైన్స్ చెప్తోంది.

నివేదిక ప్రకారం.. మరణం తర్వాత శరీరంలోని కొన్ని కణాలు ఇంకా బ్రతికే ఉంటాయి. అవి శరీరంలోని ఆక్సిజన్‌ని ఉపయోగించుకొని పెరుగుతాయి. అలా గోర్లు, జుట్టు కూడా పెరుగతాయి. అయితే, ఈ ప్రక్రియ కేవలం కొద్దిసేపు మాత్రమే జరుగుతుంది. శరీరంలో గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత జుట్టుతో పాటు గోర్లు పెరగడం ఆగిపోతాయి. ఇది నమ్మశక్యంగా లేదు కదూ! అంతేకాదండోయ్.. మృతదేహం నుంచి శబ్దాలు కూడా వస్తాయి. అయితే, అది పోస్ట్‌మార్టం సమయంలోనే ఆ శబ్దాలొస్తాయి.

చనిపోయాక మృతదేహంలో ఒక రకమైన గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. దీని వ‌ల్ల క‌ళ్లు, నాలుక బ‌య‌టికి పొడుచుకు వ‌స్తాయి. పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు.. శ‌రీరంలో ఉండే ఆ గ్యాస్ స్వర‌పేటిక‌పై ఒత్తిడి క‌ల‌గ‌జేస్తుంది. అప్పుడే వివిధ రకాల శబ్దాలు బయటకొస్తాయి.

Exit mobile version