ప్రతిరోజూ వినోదభరితమైన, విచిత్రమైన ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి, వినియోగదారుల ఆసక్తిని ఆకర్షిస్తాయి. బెంగుళూరు కాలేజీలో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన క్రేజీ ఫైట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి వాహ్ అంటూ చప్పట్లు కొడుతూ.. నవ్వుకుంటూ వారిద్దరి ఫైట్ ను ఆస్వాదిందచడం చర్చకు దారితీస్తోంది. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లో చోటుచేసుకుంది.
Read also: Viral Video: కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరమ్మాయిల ఫైట్.. వీడియో వైరల్
మొదట ఇద్దరమ్మాయిలు కోపంతో వేలు చూపించుకుంటూ వాగ్వాదం చేసుకున్నప్పటికి రానురాను అది చిలికి గాలివానైంది. కుడివైపు వున్న అమ్మాయి ఎడమ వైపు వున్న అమ్మాయిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతితో తన చెంప ఛెల్లు మనిపించింది. దీంతో.. ఎదురుగు వున్న అమ్మాయి కూడా చేతితో బుద్దిచెప్పింది. అంతే.. అక్కడ రణరంగమే మొదలైంది. వీదిద్దరి ఫైటింగ్ కు కారణం ఏంటో తెలియదు కానీ.. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు వేలు చూపించుకోవడం, నువ్వానేనా అన్నట్లుగా వాదోపవాదాలు చేసుకోవడం అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈవీడియో ఓరేంజ్ లో దూసుకుపోతోంది. వారిద్దరూ గొడవ పడుతున్నా అక్కడున్న విద్యార్థులు ఆపాల్సింది పోయి వామ్ అంటూ అరుస్తూ వారిని ఉత్సాహపరచడాన్ని చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరమ్మాయిల ఫైట్ వీడియో..