ఇప్పుడంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మాండలికం ఏదైనా ఇంగ్లీష్ బాష విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడంటే సరే, అదే పాత రోజుల్లో ఇంగ్లీష్ ఎలా ఉండేది, వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇంగ్లీష్ పదాలను ఎలా పలికేవారు… ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు… పాత కాలంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఇంగ్లీష్ వేరు. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలను కాశ్మీరీ ఇంగ్లీష్ యాసలో పలికింది. సయ్యద్ స్లీత్‌షా అనే వ్యక్తి 30 సెకన్ల నిడివిగల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బామ్మగారి ఇంగ్లీష్ యాస నెటిజన్లను ఆకట్టుకున్నది. ఈరోజు ఉదయం పోస్ట్ చేసిన ఈ వీడియోను ట్విట్టర్‌లో 19వేల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: War: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముహూర్తం కుదిరిందా..?
