Site icon NTV Telugu

Sick Leave: సిక్‌లీవ్‌ అడిగితే లైవ్ లొకేషన్ షేర్ చేయమన్న మేనేజర్..

Redit

Redit

Sick Leave: విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ సిక్ లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి తన మేనేజర్ నుంచి ఊహించని రిప్లై వచ్చింది. అనారోగ్యానికి రుజువుగా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని అతడు డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. భారతీయ కార్యాలయాల్లో వర్క్ కల్చర్, ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది.

Read Also: Telugu Mahasabhalu 2026: నేటి నుంచి తెలుగు మహాసభలు..

వివరాల్లోకి వెళ్తే.. ఓ ఉద్యోగి తనకు తీవ్రమైన తలనొప్పిగా ఉండటంతో.. సెలవు కావాలని వాట్సాప్‌లో తన మేనేజర్ ను కోరాడు. మొదట హెచ్‌ఆర్‌తో మాట్లాడాలని చెప్పిన అతడు.. ఆ తర్వాత హెచ్‌ఆర్ విభాగం “వాలిడ్ డాక్యుమెంట్స్” అడిగిందని ఉద్యోగి చెప్పగానే, వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయాలని సూచించాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను సదరు ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. “ఇది సరైంది కాదని నాకు తెలుసు.. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?” అని సలహా కోరాడు. ఇక, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.

Read Also: Antarvedi: అంతర్వేది రథ శకలాల నిమజ్జనం నిలిపివేత

ఇక, మేనేజర్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఉద్యోగి ప్రైవసీని ఉల్లంఘించడమేనని, లొకేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దని పలువురు సూచించారు. “తలనొప్పికి వాలిడ్ డాక్యుమెంట్ ఏంటి? బాధపడుతున్న ఫొటోలు పంపాలా?” అని ప్రశ్నించారు, “ఇది ఉద్యోగం, బానిసత్వం కాదని మరో యూజర్ కామెంట్స్ పెట్టాడు. ఇలాంటి టాక్సిక్ మైక్రో మేనేజ్‌మెంట్స్ వల్లే దేశీయ కంపెనీలు ఇంకా వెనుకబడుతున్నాయని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

https://www.reddit.com/r/IndianWorkplace/comments/1q1q84c/is_asking_for_live_location_okay/?utm_source=share&utm_medium=web3x&utm_name=web3xcss&utm_term=1&utm_content=share_button

Exit mobile version