NTV Telugu Site icon

Elephant Bath: ఏనుగా.. మజాకా. ఎలిఫెంట్‌ @ టబ్‌ బాత్‌

Elephant Bath

Elephant Bath

విహారానికి బయటకు వెళ్ళినప్పుడు మనం స్నానం చేయాలంటే నదిలోనో, సముద్రంలోనో హాయిగా చేస్తాం. మనకి మంచి లగ్జరీ ఇల్లుంటే.. అందులో మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న బాత్ టబ్ లో ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తాం. కానీ ఓ ఏనుగు బాత్ టబ్ లో స్నానం చేయడం గురించి కన్నారా.. విన్నారా? అయితే చదివేయండి.. ఏనుగు టబ్‌ బాత్‌ చేయటం ఎప్పుడైనా చూశారా?. చూడకపోతే ఈ గజేంద్రుడి జలకాలాటపై ఒకసారి లుక్కేయండి. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. పిల్ల ఏనుగు నీళ్ల తొట్టిలో పొర్లు స్నానం చేస్తుండటం భలే బాగుంది. ‘సీసీటీవీ ఇడియెట్స్‌’ పేరుతో ఉన్న ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోని షేర్‌ చేశారు. చిన్నారులు కేరింతలు కొట్టినట్లుగా ఎలిఫెంట్‌ టబ్‌ బాత్‌ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Train Birthday: రైలుకీ ఒక రోజు వచ్చింది. పుట్టిన రోజు. హ్యాపీ బర్త్‌ డే పినాకిని

నిజానికి ఈ వీడియోని స్టోరీఫుల్‌ అనే సంస్థవాళ్లు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. స్టోరీఫుల్‌ అనేది వరల్డ్‌ సోషల్‌ మీడియా ఇంటలిజెన్స్‌, న్యూస్ ఏజెన్సీ. న్యూస్‌ అండ్‌ బిజినెస్‌ పార్ట్ నర్లకు సరికొత్త సమాచార వేదికగా వ్యవహరిస్తోంది. నీళ్లలో ఏనుగు ఎంజాయ్‌ చేస్తున్న ఈ వీడియోని ఇవాళ వేకువజామున నెట్టింట్లో పెట్టింది. ఒక రబ్బరు తొట్టెలోకి ఓ వ్యక్తి పైపుతో నీళ్లు నింపుతుంటే గజేంద్రుడు అందులో పడుకొని అటూ ఇటూ పొర్లటం, ఒళ్లంతా శుభ్రమయ్యేదాక నీళ్లు పట్టించుకోవటం చూపరులను కట్టిపడేస్తున్నాయి. బరువైన ఏనుగు అమాంతం పడ్డా ఏమాత్రం చెక్కుచెదరని ఆ రబ్బరు తొట్టెని చూస్తే ఔరా అనకమానరు. ఈ వీడియోని గంటల వ్యవధిలోనే లక్ష మందికి పైగా వీక్షించారు. తాను స్నానం చేయటం అయిపోయాక ఆ ఏనుగు వాటర్‌ పైపును తీసుకొని పరుగెత్తటం కొసమెరుపు.

BRAOU : డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల