Elephant Bath: ఏనుగా.. మజాకా. ఎలిఫెంట్ @ టబ్ బాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విహారానికి బయటకు వెళ్ళినప్పుడు మనం స్నానం చేయాలంటే నదిలోనో, సముద్రంలోనో హాయిగా చేస్తాం. మనకి మంచి లగ్జరీ ఇల్లుంటే.. అందులో మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న బాత్ టబ్ లో ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తాం. కానీ ఓ ఏనుగు బాత్ టబ్ లో స్నానం చేయడం గురించి కన్నారా.. విన్నారా? అయితే చదివేయండి.. ఏనుగు టబ్ బాత్ చేయటం ఎప్పుడైనా చూశారా?. చూడకపోతే ఈ గజేంద్రుడి జలకాలాటపై ఒకసారి లుక్కేయండి. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. పిల్ల ఏనుగు నీళ్ల తొట్టిలో పొర్లు స్నానం చేస్తుండటం భలే బాగుంది. ‘సీసీటీవీ ఇడియెట్స్’ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు. చిన్నారులు కేరింతలు కొట్టినట్లుగా ఎలిఫెంట్ టబ్ బాత్ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Train Birthday: రైలుకీ ఒక రోజు వచ్చింది. పుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే పినాకిని
Also Read
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
- Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ 'ఆశ చాక్లెట్' మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
నిజానికి ఈ వీడియోని స్టోరీఫుల్ అనే సంస్థవాళ్లు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. స్టోరీఫుల్ అనేది వరల్డ్ సోషల్ మీడియా ఇంటలిజెన్స్, న్యూస్ ఏజెన్సీ. న్యూస్ అండ్ బిజినెస్ పార్ట్ నర్లకు సరికొత్త సమాచార వేదికగా వ్యవహరిస్తోంది. నీళ్లలో ఏనుగు ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోని ఇవాళ వేకువజామున నెట్టింట్లో పెట్టింది. ఒక రబ్బరు తొట్టెలోకి ఓ వ్యక్తి పైపుతో నీళ్లు నింపుతుంటే గజేంద్రుడు అందులో పడుకొని అటూ ఇటూ పొర్లటం, ఒళ్లంతా శుభ్రమయ్యేదాక నీళ్లు పట్టించుకోవటం చూపరులను కట్టిపడేస్తున్నాయి. బరువైన ఏనుగు అమాంతం పడ్డా ఏమాత్రం చెక్కుచెదరని ఆ రబ్బరు తొట్టెని చూస్తే ఔరా అనకమానరు. ఈ వీడియోని గంటల వ్యవధిలోనే లక్ష మందికి పైగా వీక్షించారు. తాను స్నానం చేయటం అయిపోయాక ఆ ఏనుగు వాటర్ పైపును తీసుకొని పరుగెత్తటం కొసమెరుపు.
BRAOU : డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!