Viral Video: సాధారణంగా జంతువులు సర్కాస్ లో డ్యాన్సులు వేయడం చూస్తూనే ఉంటాం. కోతులు, కుక్కలు వాటి శరీర పరిమాణం చిన్నగా ఉంటాయి కాబట్టి డ్యాన్స్ ఈజీగా చేయగలుతాయి. ఇక ఏనుగు పరిమాణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి డ్యాన్స్ అంటే పెద్దగా స్టెప్పులను ఊహించం.. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఓ ఏనుగు తన శరీరాన్ని మెలితిప్పుతూ బ్రేక్ డ్యాన్సులు మొదలెట్టిందండోయ్. అది చూసిన వీక్షకులకు మతి పోయింది. ఏంది ఇది ఏనుగు డ్యాన్సా అంటూ అవాక్కవుతున్నారు. దాని స్టెప్పులను చూసి మురిసిపోతున్నారు. ఇక్కడి వీడియోను ఓ సారి చూస్తే ఏనుగులు సైతం డ్యాన్స్ చేయగలవని ఒప్పుకుని తీరాల్సిందే. వీడియో ఏ ప్రాంతానికి సంబంధించినదో తెలియదు కానీ, అందులో ఒక ఏనుగు చక్కని స్టెప్పులతో అదరగొట్టింది. అది డ్యాన్స్ చేస్తున్న వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది మనోళ్లు వైరల్ చేయడంతో ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైకులు వచ్చిపడుతున్నాయి.
Read Also: Punjab Jail: పంజాబ్ జైల్లో రొమాన్స్.. ఫ్రీగా కండోమ్స్ కూడా!
డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. కానీ, కొంతమంది యానిమల్ లవర్స్ మాత్రం కోపం తెచ్చకుంటున్నారు. శిక్షకులు కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారని, ఇలాంటి వీడియోలకు మద్దతు ఇవ్వొద్దని కోరుతున్నారు. ‘‘జంతువులు ఉన్నది డ్యాన్స్ చేసి సంతోష పెట్టడానికి, మనుషుల కడుపు నింపడానికి కాదు. వాటిని సహజంగా బతకనివ్వండి. జంతువులను హింసించడాన్ని ఆపండి’’అని ఓ యూజర్ పేర్కొన్నాడు.
A BABY ELEPHANT DANCE ON ROAD #elephants #Dancing pic.twitter.com/Z5L326dYfP
— Apurba Kalita (@apurbakalita02) February 4, 2022