Site icon NTV Telugu

shocking Incident: మహిళను బంధించి..రచ్చ రచ్చ చేసిన వృద్ధురాలు.. వీడియో వైరల్

Untitled Design

Untitled Design

దేవుడిని పూజించుకునేందుకు గుడికి వచ్చిన మహిళను లోపల బంధించి తాళం వేసి.. నానా రచ్చ చేసింది ఓ వృద్ధురాలు. ఇదేంటని అడిగినా వారిపై దురుసుగా సమాధానం ఇచ్చింది. వృద్ధురాలు ఇలా చేయడంలో అక్కడున్న వాళ్లంతా కొంచెం ఆశ్చర్యానికి ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తతో పాటు దేవుడిని దర్శించుకునేందుకు దేవుడి సన్నిధానానికి వెళ్లింది. అయితే.. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ మహిళ ఆమెను లోపల బంధించి తాళం వేసింది. ఇదంతా చూసిన స్థానికులు షాకయ్యారు. ఆమె భర్త తాళం పగులగొట్టి భార్యను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అతడిని కూడా ఆమె అడ్డుకుంది. తాళం తీయనంటే.. తీయనని మొండికేసింది. పోలీసులు వచ్చినా తాను భయపడనూ అంటూ.. రచ్చ రచ్చ చేసింది. అయితే చివరకు భర్త ఎలాగో అలాగో తాళం పగులగొట్టి భార్యను బయటకు తీసుకు వచ్చాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చేసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వృద్ధురాలి మానసిక స్థితి బాగాలేదని అందుకే తాను ఇలా చేసి ఉంటుందని అనుకుంటున్నారు నెటిజన్లు.

Exit mobile version