Site icon NTV Telugu

Effect of Signature on Life: సంతకం పెట్టే సమయంలో ఇలా చేస్తున్నారా..? అయితే..!

Effect Of Signature On Life

Effect Of Signature On Life

సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. సంతకం పెట్టడం అనేది కూడా ఒక కల అంటారు చాలా మంది. కొంత మంది చిన్నగా పెడితే మరికొందరు పూర్తి పేరుతో సంతకం పెడుతుంటారు. ఈ సంతకాలు కూడా మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందంట..? అదెలా అంటారా..! కొంత మంది తమ సంతకం చేసే క్రమంలో తెలుగు అక్షరాలతో పేరు రాస్తే, మరికొందరు తెలుగు ఇంగ్లీష్ రెండు అక్షరాలు కలిపి సంతకం చేస్తుంటారు.

Read also: Krishna Floods: గోదావరి శాంతించింది.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది

ఇక కొంత మంది సంతకం చేసే క్రమంలో మొదటి అక్షరాన్ని పెద్దగా రాసి చివరి అక్షరం చిన్నాగా రాసి చివరకు ఒక చుక్కపెడుతుంటారు. అయితే.. ఇలా సంతకం పెడితే అది జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన సంతకంలో పేరులోని మొదటి అక్షరాన్ని రాసి.. పేరుకు దిగువన చుక్క వేస్తే.. అలాంటి వ్యక్తి ధనవంతుడవుతాడని, వారు ఆర్థికంగా కూడా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు వారి వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుందని చెబుతున్నారు పండితులు.

అయితే.. కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య సంతకం చేయడంలో ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన సంతకంగా కూడా గుర్తించింది. కర్ణాటక రాష్ట్రంలోని హోనావర్‌ సబ్ రిజిస్టర్ శాంతయ్య తన సంతకం విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించారు. ఉద్యోగ విధుల్లో భాగంగా ఆయన నిత్యం సంతకాలు పెడుతుండాలి. అయితే తన సంతకాన్ని ఎవరూ కాపీ కొట్టకుండా… చాలా కష్టంగా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. ఆయన పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. ఆయన తన పేరును ఆంగ్లంలో కుదించి సంతకం చేయడం ప్రారంభించారు. అది కూడా చాలా కష్టతరంగా ఉండటంతో ఆయన సంతకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Astrology: జూలై 25, సోమవారం దినఫలాలు

Exit mobile version