Site icon NTV Telugu

Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!

Wedding

Wedding

Sheru Weds Sweety : జీవితంలో జరిగే అతిపెద్ద పండుగ పెళ్లి. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. అలాంటి పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. పూర్వం పెళ్లి అంటే ఐదు రోజుల పండుగలా నిర్వహించేవారు. పెద్దలు కూడా తమ బిడ్డల పెళ్లిని ఆకాశమంత పందిరి కింద ఒక తరం పాటు గుర్తుండిపోయేలా చేయాలని కలగంటారు. ఈ క్రమంలో పెళ్లికి తమ వాళ్లందరినీ ఆహ్వానించి బిడ్డల పెళ్లి చేసి ఆనందపడుతారు. గురుగ్రామ్ లో కూడా అలాంటి పెళ్లే జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో చూస్తే పెళ్లి ఏర్పాట్లను చూసి ఆశ్చర్య పోతారు. కానీ పెళ్లికూతురు, కుమారులను చూస్తేనే షాక్ అవుతారు. కాకాపోతే ఇది మనుషుల పెళ్లికాదు కుక్కల పెళ్లి. అవునండి మీరు చదివింది…. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి సామెత విన్నాం కానీ కుక్కల పెళ్లికి మనుషుల హడావుడి అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

Read Also: Hardik pandya Hair stylist: న్యూ లుక్‌ లో రచ్చరేపుతున్న సినీ క్రీడా సెలబ్రెటీలు

అసలు విషయం ఏంటంటే.. గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే మగ కుక్క స్వీటీ అనే ఆడకుక్కను వివాహం చేసుకుంది. భారతీయ ఆచారాలకు తగ్గట్టు వాటి యజమానులు పెళ్లి నిర్వహించారు. ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. స్వీటీ(ఆడకుక్క) యజమాని సవిత మాట్లాడుతూ.. తన భర్త గుడి సమీపంలోని కుక్కలకు రోజు ఆహారం ఇచ్చేవాడని… ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుంటే ఓ కుక్క తనను అనుసరించిందని తెలిపింది. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో అప్పటినుంచి స్వీటీ పేరుపెట్టి సాదుకుంటున్నట్లు తెలిపింది. వారు నివసించే పక్క ఇంట్లో షేరు అనే మగ కుక్క ఉండేది. పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు వాళ్లు అంగీకరించారు. చివరకు నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాం అని సవిత తెలిపింది.
వరుడు షేరు(మగకుక్క) తల్లి మణిత మాట్లాడుతూ.. షేరును ఎనిమిదేళ్లుగా తమ కొడుకులాగా పెంచుకుంటున్నామని… స్వీటీతో పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒప్పుకున్నామన్నారు. అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలను కూడా ముద్రించిన ఆహ్వానాలు ,ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు.

Exit mobile version