ఈ ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే కాదు… ప్రతి ప్రాణి జివించాలి. అన్ని ప్రాణులు జీవించగలిగితేనే ప్రపంచ గమనం ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీకి చెందిన రాకేష్ ఖత్రి అనే వ్యక్తి పక్షుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఢిల్లీలో పక్షుల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు. వాటిల్లో వేల పక్షలు ఆవాసం ఉంటున్నాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రాకేష్ ఖత్రి అంటే తెలియని వ్యక్తులు బహుశా ఉండరు. ఆయన్ను అంతా నెస్ట్ మ్యాన్ అని పిలుస్తుంటారు. చాలా మందికి రాకేష్ ఖత్రి కంటే నెస్ట్‌మ్యాన్ గానే పరిచయం ఉంది.
Read: World Record: ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్… ఇండియాలోనే…
చిన్నతనంలో తాను పక్షులతో ఆడుకుంటూ, వాటిమధ్యనే పెరిగానని, చిన్నప్పటి నుంచి పక్షుల కోసం గూళ్లను కట్టడం అలవాటైందని, ఇప్పటికీ ఆ అలవాటును కొనసాగిస్తున్నానని అన్నారు. జీవితంలో ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల గూళ్లను నిర్మించి ఉంటానని అన్నారు. మొదట్లో పక్షుల కోసం తాను గూళ్లను తయారు చేసే సమయంలో అందరూ విమర్శించేవారని, ఈ గూళ్లలో పక్షులు ఎలా ఉంటాయని హేళి చేశారని, కానీ ఇప్పుడు ఆ గూళ్లలో పక్షులను చూసి అందరూ సంతోషిస్తున్నారని, పక్షులు తమ సొంత ఇల్లుగా భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
