ఈ మధ్యకాలంలో ప్రేమజంటలు పబ్లిక్ ప్లేస్ లలో ప్రవర్తిస్తున్న విధానం స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వికృత చేష్టలకు పాల్పడటం వల్ల చూసేవారికి అసౌకర్యమే కాకుండా, కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలనే ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు.
ఇటీవల రోడ్లపై, బస్‌స్టాప్‌లలో, లిఫ్ట్‌లలో ఇలా అనేక చోట్ల జంటలు రెచ్చిపోతున్న వీడియోలు బయటపడ్డాయి. తాజాగా ఓ జంట రైల్వే ట్రాక్‌పై ప్రమాదకరంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పసుపు చీర కట్టుకున్న యువతితో ఓ యువకుడు ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ కింద హగ్‌లు, ముద్దులతో రొమాన్స్‌లో మునిగిపోయారు. ఇదే సమయంలో అనుకోకుండా ట్రైన్ కదలడం ప్రారంభించడంతో ఇద్దరూ ఒక్కసారిగా భయంతో బయటకు పరుగెత్తారు. కాస్త ఆలస్యమై ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ దృశ్యాలను అక్కడి వ్యక్తులు వీడియో తీయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక ఇలా ప్రాణాలతో ఆటలుాడుతున్నార ని మండిపడుతున్నారు. “ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడైనా ఇలాంటి పనులు ఆగుతాయి” అని కామెంట్లు చేస్తున్నారు. జనాలు తిరిగే ప్రాంతాల్లో ఇలా ప్రవర్తించడం ప్రజలకు ఇబ్బంది కలిగించడం మాత్రమే కాదు, ప్రాణాలకు ప్రమాదమని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
<blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”hi” dir=”ltr”>एक चुम्मी के चक्कर मे जान से हाथ धो बेठते <a href=”https://t.co/cmxvkW45jI”>pic.twitter.com/cmxvkW45jI</a></p>— Nehra Ji (@nehraji778) <a href=”https://twitter.com/nehraji778/status/1994401703928742042?ref_src=twsrc%5Etfw”>November 28, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
