Site icon NTV Telugu

Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

Preweddingshoot

Preweddingshoot

ఒకప్పుడు పెళ్లంటే ‘‘కట్టె.. కొట్టె.. తెచ్చె’’ అన్న రీతిలో జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ ప్రస్తుత పెళ్లిళ్లు వెర్రితలలు వేస్తున్నాయి. పెళ్లికి ముందే రకరకాలైన కార్యక్రమాలు వచ్చేశాయి. ప్రతీ కార్యక్రమాన్ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇందు కోసం లక్షలు.. కోట్లు ధారపోస్తున్నారు.

ఒకప్పుడు పెళ్లైంత వరకు అమ్మాయి-అబ్బాయిలు చూసుకోవడానికి గానీ.. మాట్లాడుకోవడానికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందే ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్‌లు.. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు అంటూ రకరకాలైన ప్రోగ్రామ్స్ వచ్చేశాయి. అయితే ఏదైనా హద్దుల్లో చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఫ్రీ-వెడ్డింగ్ పేరుతో జంటలు శృతిమించుతున్నాయి. తాజాగా ఒక జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పాలైంది.

ప్రీ-వెడ్డింగ్ పేరుతో ఓ జంట హద్దులు దాటింది. సినిమా రేంజ్‌లో సీన్లు ఉండాలనుకున్నారో.. లేదంటే క్రియేటివిటీగా ఉండాలనుకున్నారో తెలియదు గానీ.. బురద నీటిలో ఫొటోషూట్‌కు దిగారు. అమ్మాయి-అబ్బాయి ఇద్దరూ బురద నీటిలో పడుకోగా.. ఫొటోగ్రఫీ టీమ్ మోకాళ్ల లోతు బురద నీటిలో నిలబడి ప్రొఫెషనల్‌గా భంగిమలు చూపిస్తూ షూట్ చేశారు. అయితే ఈ ఫొటోషూట్ ఎక్కడ చేశారో తెలియదు గానీ సోషల్ మీడియాలో నవ్వుల పాలైంది. నెటిజన్లు రకరకాలైన కామెంట్లు వస్తున్నారు.

ఏఐ కాలంలో కూడా ఇంకా ఇలాంటి ఫొటోషూట్‌లా? ఏఐ ద్వారా రకరకాలైన మోడళ్లలో తీసుకోవచ్చు కదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ప్రీ-షూట్‌ల కోసం రిస్క్ తీసుకుని డబ్బు ఎందుకు వృధా చేస్తారు? మీ ఫొటోలను మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయమని ఏఐని అడగండి..’’ అని మరొకరు రాశారు. ‘‘వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదంటే క్రైమ్ సీన్ చిత్రకరిస్తున్నారా? అంటూ మరొకరు రాసుకొచ్చారు.

 

Exit mobile version