Couple Arrested for Having S*ex on Flight : అమెరికాలోని ఓ విమానంలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాకు వెళ్తున్న విమానంలో ఓ జంట తమ సీట్లపై శృంగారం చేస్తూ కనిపించారు. విమానంలో వారు సెక్స్ చేస్తున్న దృశ్యాలను మొదట ఇద్దరు పిల్లలు చూశారు. ఆ పిల్లల తల్లి సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో విమానాశ్రయంలో దిగిన వెంటనే వారిద్దరినీ అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి సరసోటా వెళ్తున్న జెట్‌బ్లూ ఫ్లైట్ లో ఈ దారుణం జరిగింది.
READ MORE: KTR: సీఎంలో అపరిచితుడు ఉన్నాడు.. కేటీఆర్ ఘాటు విమర్శలు
WWSB మీడియా నివేదిక ప్రకారం.. ట్రిస్టా రీల్లీ (43), క్రిస్టోఫర్ డ్రూ ఆర్నాల్డ్ (42) కనెక్టికట్‌లోని డాన్‌బరీకి చెందినవారు. వారు న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాలోని సరసోటాకు విమానంలో వెళుతున్నారు. వీరు ఎకంగా విమానంలో సె*క్స్ చేస్తుండగా.. పక్క సీటులోని మహిళ గమనించింది. పక్కనే ఉన్న తమ పిల్లలు చూస్తున్నారని మందలించింది. అయినా ఆ కపుల్ నీశ్చపు పనిని ఆపకపోవడంతో ఫ్లైట్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది వారి దుశ్చర్యను గమనించారు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ జంటను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆ ఇద్దరు పిల్లలను ఎంక్వైరీ చేశారు. ఈ జంట లైంగిక చర్యలను చూశామని ఆ పిల్లలు అధికారులకు చెప్పారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు. మైనర్ల ముందు అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఫ్లోరిడాలో చాలా తీవ్రమైన నేరం (సెకండ్-డిగ్రీ ఫెలోనీ). ఈ కేసులో వీరు దోషులుగా తేలితే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
READ MORE: Balakrishna Wife Vasundhara Devi: బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే..
