Site icon NTV Telugu

Viral Vedio: ఏందయ్యా ఇదీ..! బైక్ పై నుంచే రోడ్డా?..

Byke

Byke

సిన్సియ‌ర్ వ‌ర్క‌ర్స్ అంటే వీరినే అనాలి. ఎందుకంటారా.. ఏది అడ్డువ‌చ్చిన ప‌ట్టించుకోలేదు. మేము ప‌నిచేయ‌డంలో ముందుంటాము. ఎవ‌రు మ‌మ్మ‌ల్ని ఆప‌రు అంటూ ప‌నిచేసుకుంటూ వెళ్లిపోయారు. అస‌లు అక్క‌డ ప‌రిమీష‌న్ లేదు. అయినాకూడా ప‌నిచేశారంటే ఎంత సిన్సియ‌ర్ లో చూడండి. వారు చేసిన ప‌నికి అంద‌రూ ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆవీడియోను చూసిన జ‌నాలు అవాక్క‌య్యారు. ఇంత‌కీ ఆ వీడియో ఏంటి అనేదేగా.. ఈ ..ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఘ‌ట‌న‌ తమిళనాడులోని వెల్లూర్ లో జరిగింది.

ఇక వివార‌ల్లోకి వెళితే.. తమిళనాడులో వెల్లూర్ మున్సిపాలిటీలోని గాంధీ రోడ్ ప్రాంతంఎస్. మురుగన్ అనే వ్య‌క్తి నివాసం వుంటున్నాడు. రోజూలాగే సాయంత్రం తన బైక్ ను ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే.. ఉదయం లేచి బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మురుగన్ బైక్ తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. అంతే.. ఇంటి ముందు పరిస్థితి చూసి అవాక్కయ్యాడు. గ‌ల్లీలో సిమెంట్ సీసీరోడ్డు వేశారు. అయితే బైక్ ను తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పార్క్ చేసి ఉన్న బైక్ అలా ఉండగానే సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. అంతేకాదు.. బైక్ ముందు, వెనక టైర్లు, స్టాండ్ ఆ సిమెంట్ రోడ్డులో చిక్కుకుపోయి ఉన్నాయి. దీంతో.. బైక్ య‌జ‌మాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. త‌ను రోజూ ఇంటి ముందే బైక్ పార్క్ చేసి పెట్టుకుంటానని చెప్పారు. కనీసం పిలవకుండానే బైక్ ను అలాగే ఉంచే రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల‌నీలో రోడ్డుపై నీళ్లు డ్రైనేజీలోకి వెళ్లే రంధ్రాలనూ కూడా సిమెంట్ తో మూసేశారని మండిపడ్డారు.

read also: Rajyasabha: రాజ్యసభకు త్రిపుర సీఎం రాజీనామా.. ఖాళీగా మరో సీటు

మురుగ‌న్‌.. పార్క్ చేసిన బైక్ ను అలాగే ఉంచి రోడ్డు వేయడంపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. అయితే చిత్రమేమిటంటే అసలు ఆ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ కు తాము అనుమతి ఏమీ ఇవ్వలేదని, రోడ్డు ఎలా వేశారని కమిషనర్ మండిప‌డ్డారు. అంతేకాకుండా.. కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశామ‌ని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామ‌ని కమిషనర్ పేర్కొన్నారు. వీడియో వైరల్ కావడంతో.. ఈవిష‌యం కాస్త సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

Exit mobile version