NTV Telugu Site icon

Dog Singing Video: ఇంగ్లీష్‌ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..

Dog Singer

Dog Singer

కుక్కలు తరచుగా ఆడటానికి, ప్రయాణించడానికి ఇష్టపడతాయి. మీరు వాటిని వాకింగ్ సమయంలో లేదా కారులో బయటకి తీసుకెళ్తే గంతేసుకుంటూ వచ్చేస్తాయ్. ఇలాంటి వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా కనిపిస్తాయి. కానీ ఈ బుల్ డాగ్ వీడియో మాత్రం వేరే లెవల్ గురూ.. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా దానికి ఫ్యాన్ అయిపోతారు.. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది.. కుక్క ఇంగ్లీష్ పాటను ఎలా పాడిందో పూర్తిగా తెలుసుకుందాం…

READ MORE: AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..

ఇమాజిన్ డ్రాగన్స్‌లోని ‘బిలీవర్’ పాటను బుల్ డాగ్ చాలా ఫన్నీగా హమ్ చేస్తూ కనిపించిన కారణంగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు, కొంతమంది వెనుక, ముందు సీటుపై కూర్చున్నట్లు వీడియోలో మీరు చూడొచ్చు. బుల్ డాగ్ మధ్యలో నిలబడి.. రెండు ముందు సీట్లను పట్టుకుంది. కారులో బిలీవర్ పాట ప్లే అవుతోంది. పాట మధ్యలో ఓహో..ఓహ్ అని శబ్దం వచ్చినప్పుడల్లా బుల్ డాగ్ కూడా తల పైకెత్తి ట్యూన్, రిథమ్, రిథమ్‌కి అనుగుణంగా ‘ఊ’ అంటూ కనపడుతుంది. పాటతో తన రిథమ్‌ను సరిపోల్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. దాని రియాక్షన్ చూస్తుంటే ఇదే తన ఫేవరెట్ సాంగ్ అని అనిపిస్తోంది. కారు వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా ఈ క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @crowley_crowloలో పోస్ట్ చేశారు. దీనికి 20 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాదు లక్షల మంది దీన్ని లైక్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత, వినియోగదారులు బుల్ డాగ్‌పై చాలా ప్రేమను కురిపిస్తున్నారు.

Show comments