Site icon NTV Telugu

Viral video: యజమాని అంతక్రియల్లో పాల్గొని కన్నీరు పెట్టుకున్న ఎద్దు

Sam

Sam

సాధారణంగా ఎవరైనా చనిపోతే.. మనం వాళ్ల ఇంటికి వెళ్లి అంతక్రియలు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకుంటాం.. అయితే కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా వారికి ఇష్టమైన వారికి కోసం ఎంత దూరమైనా వస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా కొన్ని మూగ జీవాలు తమకు ఇష్టమైన వారు చనిపోతే.. చివరి చూపుకు వెళ్లి.. అంతక్రియలు అయిపోయే వరకు అక్కడే ఉన్న ఘటనలు మనం చాలా చూసాం..

పూర్తి వివరాల్లోకి వెళితే.. రైతుతో ఎద్దుకు తండ్రీకొడుకుల సంబంధం ఉంటుందంటారు. రైతు తన వ్యవసాయాన్ని నిలబెట్టే ఎద్దును కన్నకొడుకులాగా చూసుకుంటాడు. తండ్రి పంచే ఆప్యాయతను పంచుతాడు. అందుకే ఈ బంధంలో ఏ ఒక్కరు దూరమైనా మరొకరికి కన్నీరే మిగులుతుంది. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధుడైన రైతు చనిపోవడంతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు అందరూ కడసారి చూసినట్లుగానే.. ఆ రైతుకు సంబంధించిన ఎద్దుకు కూడా ఆయనను చూపించారు.

ఆ ఎద్దు తన యజమానిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. మొత్తానికి ఆ రైతుకు కన్నీటితో వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో మన దగ్గర వాళ్లు చనిపోతే పట్టించుకోవడం లేదు.. అలాంటి సమాజంలో బతుకుతున్నాం. ఓ జంతువు తన యజమాని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉందో ఈ వీడియో చూస్తే.. అర్థమవుతుంందా.

దీంతో ఆ ఎద్దు కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్నవారందరినీ కలిచి వేసింది. హృదయం ద్రవించేలా ఏడ్చిన ఎద్దు.. మొత్తానికి ఆ రైతుకు కన్నీటితో వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇంతకు మించి ఈ జన్మకు ఏం కావాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. డబ్బు, హోదా, పలుకుబడి అని పరుగులు పెట్టే జనాలంతా.. ఈ వీడియో చూసి ఇప్పటికైనా మానవత్వం, బంధం అంటే ఏంటో గుర్తిస్తారని అనుకుంటున్నామని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version