అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడతారు. అగ్నిప్రమాదం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు కాపాడే సమయంలో కొన్నిసార్లు సిబ్బంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. అయినా ఏమాత్రం బెదిరిపోకుండా ప్రమాదాల నుంచి రక్షిస్తుంటారు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నా అదరకుండా బెదరకుండా బాధఙతులను కాపాడేందుకు ముందుకు దూకుతుంటారు. బల్గేరియాకు చెందిన ఓ అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద భవనాన్ని నిచ్చేన సహాయంతో కేవలం 15సెకన్ల వ్వవధిలోనే ఎక్కి చేసిన ఫీట్ ఆకట్టుకుంటున్నది. అదేవిధంగా, సముద్రంలో బోట్‌కు మంటలు అంటుకున్నప్పుడు జెట్‌స్కీ సహాయంతో మంటలను అదుపుచేసిన తీరు ఆకట్టుకుంటున్నది.
Read: ఉద్యోగుల పోరాటం వృథా కాలేదు.. వెంకట్రామిరెడ్డి
