Site icon NTV Telugu

Bride Catch Rasgulla: రసగుల్లాను జెట్ స్పీడ్ లో పట్టుకున్న పెళ్లి కూతురు.. ఎంఎస్ ధోనీతో పోల్చుతున్న నెటిజన్స్

Rasagulla

Rasagulla

Bride Catch Rasgulla: పెళ్లి వేడుకలో జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి సమయంలో వరుడికి అతడి తల్లి రసగుల్లా తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ మిఠాయి చెంచా నుంచి జారిపడి కింద పడబోయింది. అంతే, ఒక్క క్షణంలో వధువు అప్రమత్తమై గాల్లోనే ఆ రసగుల్లాను పట్టేసుకుంది. నేలపై పడకుండా, వరుడి దుస్తులకు మరక అంటకుండా చేసిన ఆ చురుకైన చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న వాళ్లు కెమెరాలో బంధించబడటంతో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది.

Read Also: T–Hub: టీ హబ్‌ ను స్టార్టప్​ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం

అయితే, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వధువు చురుకుదనాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమెను ప్రొఫెషనల్ క్రీడాకారులతో పోలుస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, పెళ్లి కూతురు సగం క్రికెట్ జట్టు కంటే మంచి వికెట్ కీపర్ అని ఒకరు కామెంట్ చేయగా, ఆమెకు వరుడి వెంటే కాదు, స్నాక్స్ వెంటే కూడా రక్షణ ఉందంటూ మరొకరు నవ్వులు పూయించారు. “రిఫ్లెక్స్ లెవెల్: 100/100” అంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇంకోక్కరు.. వికెట్ల వెనక ధోనీ ఉండే చురుకుదాన్ని ఈ వధువు గుర్తు చేసిందని కామెంట్ పెట్టాడు. కాగా, ఈ వీడియోకు రోజురోజుకీ వ్యూస్, షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి. జీవిత భాగస్వామి అంటే కేవలం కష్టాల్లోనే కాదు, డెజర్ట్ జారిపడే సమయంలో కూడా అండగా ఉండాలనే సరదా వ్యాఖ్యలను నెటిజన్లు చేస్తున్నారు.

Exit mobile version