సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలలా ఏమి జరుగుతున్నా క్షణాల్లోనే తెలిసిపోతుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు వివిధ రకాలుగా జరుగుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి అని అర్థం ఉంది. పెళ్లికి ముందు చాలా ప్రాంతాల్లో బరాత్ జరుగుతుంది. ఈ బరాత్‌లో నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తుంటారు. డుగ్గుడుగ్గు బెల్లెట్టు బండి సాంగ్ లో వధువు వేసిన డ్యాన్స్ అప్పట్లో ఇంటర్నెట్‌లో సంచలంగా మారింది. తాజాగా ఓ నూతన వధువు బాంగ్రా డ్యాన్స్‌ను తనదైన స్టైల్‌లో చేసి వావ్ అనిపించింది. నూతన వధువుకు డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. 25 లక్షల మందికి పైగా వ్యూస్ రాగా, 1.25 లక్షల లైకులు వచ్చాయి. గోల్డ్ కలర్ లెహంగాలో అమె చేసిన భాంగ్రా నృత్యానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
Read: Stock Markets: ఏడు రోజుల వరస నష్టాలకు బ్రేక్… ఈరోజు…
