ఒకప్పుడు ప్రేమ అంటే ఆమె నా జీవితం తాను లేకుంటే జీవితం లేదు అంటూ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే వాళ్లు.. ఏదైనా చేసేవాళ్ళు.. ఇప్పుడు రాక్షస ప్రేమను చూపిస్తున్నారు.. ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే ఆ అమ్మాయి ఎవరికి దక్కకూడదు అని దారుణంగా చంపేస్తున్నారు.. ఇక మరోవైపు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు కొందరు అబ్బాయిలు.. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేమను అందరి ముందు ధైర్యంగా చెప్పాలని అనుకున్నాడు.. అందుకోసం వినూత్న ఆలోచన చేశాడు.. షాపింగ్ మాల్ లో అయితే తన ప్రేయసి ఒప్పుకుంటుందని అనుకున్నాడు..
ఇక అనుకున్నట్లుగా షాపింగ్ మాల్ లో అందరూ చూస్తుండగా, తాను ప్రేమిస్తున్న ప్రియురాలికి పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉండటంతో, నెట్టింట వైరల్ గా మారింది. కాగా, నెటిజన్ల రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరు చూస్తుంటే ఏం చేస్తుంది ఒప్పుకోక చస్తుందా అని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి కొంతమంది స్నేహితులతో ఉన్న మహిళ వైపు నడుస్తూ కనిపించాడు. వాళ్లు వెళ్తుంటే, ఈ వ్యక్తి వెళ్లి వారి వెనక మోకాళ్ల పై కూర్చున్నాడు. చేతిలో ఉంగరంతో ఉన్నాడు. అతనిని చూసి, వారిలో ఉన్న ఓ అమ్మాయి వెంటనే అతనిని గుర్తుపట్టి నవ్వేసింది. వెంటనే ఆమెకు అతను ఉంగరం ఇచ్చాడు. ఆమె వెంటనే ఆ ఉంగరాన్ని అందుకుంది.. ఆపై అతన్ని కౌగిలించుకుంది..అతను నటించడం లేదని,నిజాయితీగా ప్రేమను తెలియజేశాడు అని కొందరు కామెంట్స్ చేయగా, అతని ప్రపోజల్ కి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ షాక్ అయ్యారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు కాదంటారు..