Site icon NTV Telugu

యూనివ‌ర్శిటీలో స‌రికొత్త శిక్ష‌ణ‌: పేడ‌తో పిడ‌క‌లు చేయ‌డం ఎలా?

సాధార‌ణంగా విశ్వ‌విద్యాల‌యాల్లో విద్య‌ను బోధిస్తుంటారు. వివిధ వృత్తుల‌పై శిక్ష‌ణ ఇస్తుంటారు. అయితే, వార‌ణాసిలోని హిందూ బ‌నార‌స్ విశ్వ‌విద్యాల‌యంలో పిడ‌క‌ల‌పై విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. సోష‌ల్ సైన్స్ అండ్ ఫ్యాక‌ల్టీ డీన్ ప్రొఫెస‌ర్ కౌశిల్ విద్యార్థుల‌కు పిడ‌క‌లు చేయ‌డంపై శిక్ష‌ణ అందించారు. విశ్వ‌విద్యాల‌యంలోని స‌మీకృత గ్రామాభివృద్ది కేంద్రంలో విద్యార్థుల‌కు శిక్ష‌ణ అందించారు. కేవ‌లం వంట చేసుకోవ‌డానికి మాత్ర‌మే కాకుండా య‌జ్ఞ‌యాగాదుల్లోనూ, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లోనూ పిడ‌క‌ల‌ను వినియోగిస్తారు. ఒక‌ప్పుడు గ్రామాల్లో పిడ‌క‌ల‌ను ప్ర‌తి ఇంట్లో వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే వీటిని వినియోగిస్తున్నార‌ని, ఆవుపేడ‌తో చేసిన పిడ‌క‌ల వ‌ల‌న ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని, విద్యార్థులు వాటి వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాల‌కు తెలియ‌జేసి పిడ‌క‌ల‌ను త‌యారు చేసేలా ప్రోత్స‌హించాల‌ని అన్నారు. పిడ‌క‌ల త‌యారీపై డీన్ ఓ వీడియోను రూపొందించి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతున్న‌ది.

Read: బ్రిట‌న్‌కు త‌దుప‌రి రాణి ఆమెనా…?

Exit mobile version